- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉద్యోగాల కల్పనపై కేసీఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే శ్వేతపత్రం ఇవ్వాలి: YS Sharmila
దిశ , తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు 58,240 మాత్రమేనని దీనిపై దమ్ముంటే శ్వేతా పత్రం విడుదల చేయాలనీ వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, అతని కొడుకు కేటీఆర్ మాత్రం లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్దాలు చెబుతున్నారని తెలిపారు .తొమ్మిదేండ్లు అయినా ఇంటికో ఉద్యోగం ఇవ్వకుండా కాలయాపన చేరని అన్నారు. నిరుద్యోగ భృతి లేదని పైగా తన కుటుంబానికి మాత్రమే పదవులు అప్పగిస్తూ.. తెలంగాణ తల్లికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు . 2022 మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం కేసీఆర్ లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
మరో 80 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రకటన ఇచ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని పేర్కొన్నారు కేసీఆర్ నియమించిన బిశ్వాల్ కమిటీ లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినా.. ఆ రిపోర్టును కె సి ఆర్ చెత్త బుట్టలో పడేశారని తెలిపారు . తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టారని విమర్శించారు . ప్రతిసారి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతూ నిరుద్యోగులను నిండా కేసీఆర్ ముంచుతున్నాడని అన్నారు . అవినీతిలో కూరుకుపోయిన టీఎస్పీఎస్సీని ఎలాంటి ప్రక్షాళన చేయకుండానే మళ్లీ పరీక్షలు పెడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
- Tags
- YS Sharmila