మేడిగడ్డ ఇష్యూపై BRS షాకింగ్ డెసిషన్.. గులాబీ నేతలకు KCR సంచలన ఆదేశం..!

by Satheesh |   ( Updated:2023-10-25 13:05:06.0  )
మేడిగడ్డ ఇష్యూపై BRS షాకింగ్ డెసిషన్.. గులాబీ నేతలకు KCR సంచలన ఆదేశం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీ అంశంలో ఎవరు కూడా ఏం మాట్లాడొద్దని బీఆర్ఎస్ లీడర్లకు గులాబీ బాస్ ఆదేశించినట్టు తెలిసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు మౌనంగా ఉండాలని, ఈ విషయాన్ని పూర్తిగా ఇరిగేషన్ అధికారులే చూసుకుంటారని చెప్పినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం మేడిగడ్డ బ్యారేజీలోని 20వ పిల్లర్ కుంగిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు సర్కారును టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఇంతవరకు అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

ఏం మాట్లాడితే.. ఏం జరుగుతుందో..!?

మేడిగడ్డ బ్యారేజీ అంశం గులాబీ లీడర్లకు పెద్ద సమస్యగా తయారైంది. ఇన్సిడెంట్‌పై ఏం మాట్లాడితే ఏం అవుతుందోననే టెన్షన్‌లో వారు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటుచేసుకున్నదని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. వీటిపై స్పందిస్తే, ఆ అంశం వచ్చే ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారే ప్రమాదముందనే భయం బీఆర్ఎస్ లీడర్లకు పట్టుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో విచారణ నివేదిక వచ్చేవరకు ఏం మాట్లాడొద్దని ప్రగతిభవన్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అందుకే విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా గులాబీ లీడర్లు మౌనంగా ఉంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

ప్రగతిభవన్ సూచనతోనే ఫిర్యాదు..?

పిల్లర్ కుంగడంపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై నీటిపారుదల శాఖ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతిభవన్ ఆదేశాల మేరకే ఇన్సిడెంట్ వెనుక విద్రోహ చర్య ఉందని ఫిర్యాదు చేశారా? అనే చర్చ జరుగుతున్నది. బ్యారేజీకి ఇరువైపులా రాత్రింబవళ్లు పోలీసుల పహారా ఉంటుంది. నిర్మాణం నుంచి మొదలుకుని ప్రస్తుతం వరకు బందోబస్తు కొనసాగుతున్నది. ‘ఇంతటి నిఘా మధ్య బ్యారేజీ వద్దకు విద్రోహులు ఎలా వెళ్తారు? ఇదంతా కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న హంగామా’ అని ఇరిగేషన్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed