Breaking News : రంగంలోకి KCR.. గులాబీ బాస్ MP ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ రెడీ..!

by Satheesh |   ( Updated:2024-03-04 06:01:08.0  )
Breaking News : రంగంలోకి KCR.. గులాబీ బాస్ MP ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ రెడీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇందులో గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గాయం కారణంగా కొన్నాళ్లు పాలిటిక్స్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి కరీంనగర్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా, ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారు.

ఈ మేరకు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ సిద్ధం అయ్యింది. బీఆర్ఎస్‌కు అచ్చొచ్చే కరీంనగర్‌లో ఈ నెల 12న భారీ బహిరంగా సభతో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ మొదలుపెట్టనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులు గులాబీ బాస్ పర్యటించేలా షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. రాష్ట్రంలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో కేసీఆర్ భారీ బహిరంగ సభలతో పాటు.. రోడ్ షోలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారికి ఆ సెగ్మెంట్‌కు ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story