- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కనిపించని గులాబీ బాస్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎక్కడ పాల్గొన్నట్లు కనిపించలేదు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి కేసీఆర్ ప్రజలకే కాక బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులకు కూడా దూరమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు మాత్రమే శాసన సభకు హాజరైన కేసీఆర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలలో తప్ప బయట ఎక్కడా మీడియా ముందుకు రావడం, సమావేశాలు నిర్వహించడం లాంటివి చేయలేదు.
రాష్ట్రంలో జరిగే పండుగలకు, వేడుకలకు ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపే గులాబీ బాస్.. ఈ సారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. మెదక్ లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో కేసీఆర్ పేరు చివరిలో వేశారు. అదికూడా కాంగ్రెస్ నాయకుల పేర్ల తర్వాత గజ్వేల్ శాసన సభ సభ్యులు కేసీఆర్ అని ప్రకటనలో ముద్రించారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ కుటుంబం దీనిపై స్పందించకపోవడం గమనార్హం. దీంతో కేసీఆర్ మొత్తానికి ఫామ్ హౌజ్ కే పరిమితం అవుతారా అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. అధినేత బయటికి వచ్చి సమస్యలపై స్పందించకపోతే.. పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.