స్వతంత్రభారతవనిలో తాగేందుకు నీరు లేదు: CM కేసీఆర్

by Satheesh |   ( Updated:2023-04-24 15:18:10.0  )
స్వతంత్రభారతవనిలో తాగేందుకు నీరు లేదు: CM కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జబిందా మైదానంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. మహారాష్ట్ర పవిత్ర భూమికి నా నమస్కారాలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. నా మాటలను ఇక్కడ విని.. ఇక్కడే మర్చిపోకండని.. నా మాటలపై మీ గ్రామాలకు వెళ్లి చర్చించడని కేసీఆర్ కార్యకర్తలకు సూచించారు. మీ ఇంట్లో వాళ్లతో, స్నేహితులు, వీధిలో ఉన్నవారందరితో చర్చించాలని కోరారు. దేశంలో ఏం జరుగుతుందో గమనించాలని.. ఇప్పటికి ప్రజలకు తాగునీరు, సాగు నీరు సరిగా అందడం లేదని అన్నారు.

సాగు నీరు, తాగు నీరు అందించని ఈ పాపం ఎవరిది అని ప్రశ్నించారు. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని తెలిపారు. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా.. మహారాష్ట్రకు నీటి సమస్యలెందుకు అని అన్నారు. స్వతంత్రభారతవనిలో తాగేందుకు నీరు లేదు.. యువతకు ఉద్యోగాల్లేవు లేవని మండిపడ్డారు. ఎంత మంది ప్రధానులు మారిన మన కష్టాలు మాత్రం పోవడం లేదని.. మనదేశంలో మార్పు రావాల్సిందేనని కేసీఆర్ నొక్కి చెప్పారు. దేశంలో మార్పు తీసుకురావడానికే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని.. కులం, మతం ప్రాతిపదికన బీఆర్ఎస్ ఏర్పడలేదని చెప్పారు. ఎవరు ఎన్ని అటంకాలు సృష్టించినా మేము భయపడేది లేదని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేక లక్ష్యం ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముంబై దేశ ఆర్థిక రాజధాని.. కానీ తాగేందుకు నీళ్లుండవా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలని.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దేశంలో పేదలు మరింత పేదరికంలో కురుకుపోతున్నారు.. సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని నీటి, విద్యుత్ సమస్యలను కూడా తీర్చలేకపోతుందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed