- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.2 లక్షల రుణమాఫీ ఎఫెక్ట్.. రాష్ట్ర రైతులకు KCR సంచలన పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చురకలు పెట్టాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని రైతులు లేఖలు రాయాలని రైతుల్ని కోరారు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఓట్ల విషయంలో ఉద్యోగులు కూడా ఆలోచించి ఓట్లు వేయాలని కేసీఆర్ వివరించారు. రైతులకు కరెంట్ నీళ్లు కావాలంటే, రైతుల ఆత్మహత్యలకు పుల్‌స్టాప్ పెట్టాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించడమే దారి అన్నారు. ఎన్నికల్లో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక విస్మరించారని విమర్శించారు. కాంగ్రెస్ కు రైతుల సమస్యలు పట్టవని అన్నారు. రైతులకు న్యాయం చేసేది ఒక బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. ఇంకా ఇవ్వడం లేదే అని కేసీఆర్ సెటైర్లు వేశారు. రూ. 2 లక్షల రుణమాఫీపై రైతులు పోస్టుకార్డులు రాయాలన్నారు. ఎండిన, నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని రైతులు లేఖలు రాయాలని కేసీఆర్ రైతులను కోరారు.