KCR: తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్

by Ramesh Goud |   ( Updated:2024-07-25 08:32:53.0  )
KCR: తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొదటి సారి ప్రతిపక్ష నేత హోదాలో లీడర్ ఆఫ్ అపోజిషన్ చైర్ లో కూర్చుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం చవిచూడటంతో కేసీఆర్ అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించడంతో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా దక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్ ను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. అనారోగ్య కారణాల రిత్యా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరుకాలేదు. కొన్ని రోజుల తర్వాత స్పీకర్ చాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. నేడు వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారి కేసీఆర్ అసెంబ్లీకి హజరయ్యారు. అసెంబ్లీలో అడుగు పెట్టిన కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష హోదాలో తన సీటులో కూర్చున్నారు. అయితే సమావేశాలు జరుగుతున్న కేసీఆర్ మొదటిసారి అసెంబ్లీకి రావడంతో ఆయన ఏం మాట్లాడతారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి కాళేశ్వరం పర్యటనకు బయలుదేరనున్నారు.

Advertisement

Next Story

Most Viewed