- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- వీడియోలు
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
KCR: నాకు కొద్దిగా సమయం ఇవ్వండి.. ఎలక్షన్ కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు గులాబీ అధినేత ఇటీవలే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జాప్యాన్ని బహిరంగ సభల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే సిరిసిల్లలో పర్యటించిన ఆయన అధికార కాంగ్రెస్ పార్టీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకుని కేసీఆర్ అనుచిత వ్యాఖ్యల చేశారంటూ కాంగ్రెస నేత నిరంజన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదును స్వీకరించి ఈసీ, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, వెంటనే ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ బుధవారం రాత్రి మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అందుకు స్పందించి కేసీఆర్ వివరణ ఇచ్చేందుకు మరో వారం రోజులు గడువు కావాలంటూ తాజాగా ఎలక్షన్ కమీషన్‌ను రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థన పట్ల ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.