- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: కల్లు గీత కార్మికులకు శుభవార్త.. CM కేసీఆర్ కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రైతులు మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే రైతు బీమా తరహాలోనే కల్లుగీత కార్మికులకు ప్రత్యేక బీమా కల్పించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కల్లు గీత కార్మికులు కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం రూ.5 లక్షల బీమా అందించనుంది. నేరుగా బాధితుల కుటుంబ ఖాతాలోనే ఈ బీమా డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఇక, కల్లు గీత కార్మికుల ప్రత్యేక బీమాకు విధివిధానాలు రూపొందించాలని కేసీఆర్ రాష్ట్ర ఎక్సెజ్, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. మే డే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుధ్ద్య కార్మికులకు రూ.1000 వేతనం పెంచిన కేసీఆర్.. తాజాగా కల్లు గీత కార్మికులకు ప్రత్యేక బీమా కల్పించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే సీఎం కేసీఆర్ వరుసగా రాష్ట్ర ప్రజలకు శుభవార్తలు చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది.