BREAKING: సీఎం రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్

by Satheesh |   ( Updated:2024-04-27 15:11:08.0  )
BREAKING: సీఎం రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రెప్పపాటు కాలం కూడా కరెంట్ పోలేదని.. కేసీఆర్ దిగిపోగానే కరెంట్ ఎందుకు పోతుందని ప్రశ్నించారు. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో అన్నం తింటుంటే రెండు సార్లు కరెంట్ పోయిందని.. సీఎం మాత్రం అసలు కరెంటే పోవటం లేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల క్షేమం కోసం రైతు బంధు పథకం తీసుకువచ్చానని తెలిపారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పంచాయతీ వచ్చిందని.. తెలంగాణ ప్రజల తరుఫున కొట్లాండేందుకు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మాకు బలం ఇస్తే సీఎం మెడలు వంచి హామీలన్నీ అమలు చేయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More...

BREAKING: కేసీఆర్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వీహెచ్‌పీ

Advertisement

Next Story