'నిరోధ్ లు అమ్ముకోమంటార్రా కుక్కల కొడుకుల్లారా?'... కాంగ్రెస్ పై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by Prasad Jukanti |
నిరోధ్ లు అమ్ముకోమంటార్రా కుక్కల కొడుకుల్లారా?... కాంగ్రెస్ పై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:2014 కంటే ముందు తెలంగాణలో ఎలాంటి దృశ్యాలు కనిపించేవో ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇవాళ తెలంగాణలో పంటలు ఎండని జిల్లా లేదని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలది ఇగిలిచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన ఆయన అనంతరం సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతు బంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొడతామంటున్నారు. సిరిసిల్లాలో బతుకమ్మ చీరల ఆర్డర్ల గురించి అడిగితే ఓ కాంగ్రెస్ నాయకులు నిరోధులు అమ్ముకుని బతకాలని అంటున్నాడు. నిరోధులు అమ్ముకుని బతకాలారా కుక్కల కొడుకుల్లారా? మీరసలు మనుషులేనా? లక్షలాది మంది చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? ఆర్డర్లు ఇస్తే ఇవ్వండి చేతకాకుంటే ఇవ్వకపోండి అంతే కానీ అవమానించేలా మాట్లాడితే మిమ్మల్ని చేనేత కార్మికులు తరిమికొడతారని హెచ్చరించారు. వెంటనే బతుకమ్మ చీరలు, స్కూల్ బట్టలు, ఆర్డర్లు, బకాయిలు ఇవ్వాలని లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ తో లాయర్ల ఫీజు ఇచ్చి హైకోర్టుకీడుస్తామన్నారు. చేనేత కార్మికులు దొబ్బితిన్నారని మాట్లాడుతున్నారని వాళ్లు దొబ్బితిన్నార్రా దొంగనాకొడకల్లారా అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఈ రాష్ట్రానికి సీఎం నువ్వా నేనా?:

ఈ ప్రభుత్వంలో వ్యవసాయ సంక్షోభం వచ్చింది. రాష్ట్రంలో నీటి నిర్వహణ సామర్థ్యం తెలియని లత్కోరులు, అసమర్థులు, చవట దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాకంటే 1.08 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలిచిందని మోసపూరిత హామీల వల్ల ప్రజలు మీకు ఓట్లు వేశారని హామీలు అమలు చేయకపోతే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ ప్రజలే మీకు కర్రుకాల్చి వాతపెడతారన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని మనిషి సృష్టించిన కృత్రిమ కరువు అన్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారలను సృష్టించాం. గత ఏడేళ్లు చెక్ డ్యామ్ లు నిరంతరం నీళ్లతో కళకళలాడేవి. కానీ ఇంజినీర్లను నిరోధించి, కేసీఆర్ ను, గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చిల్లర కుట్ర వల్ల 48 టీఎంసీల నీటిని కిందికి వదిలేశారని ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ లో ఇప్పటికే డెడ్ స్టోరీజి కంటే ఎక్కువే నీళ్లు ఉన్నాయని, నేను సూర్యాపేటకు వెళ్తే సాగర్ లెఫ్ట్ కెనాల్ కు వాటర్ వదిలారని, కరీంనగర్ కు వస్తాననగానే కూలిపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరం పంప్ లు ఆన్ చేసి వరద కాలువలకు నీళ్లు వదిలారు. నీళ్లు వదలాలని కేసీఆర్ ముందే చెప్పవచ్చుగా అని సిగ్గులేకుండా సీఎం మాట్లాడుతున్నారని, ఈ రాష్ట్రానికి సీఎం నువ్వా నేనా?, ఇంజినీర్లు ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నారు? ముందే నీళ్లు వదలాలనే తెలివి ముందెక్కడికి పోయిందని ప్రశ్నించారు.

48 గంటలు కాదు 4 గంటల్లోనే వివరాలిచ్చాం:

వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని నేను మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత గలీజ్ గా మాట్లాడాడు. చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వాలని నాకు 48 గంటల టైమ్ ఇచ్చారు. కానీ మేము 4 గంటల్లోనే సీఎస్ కు 209 మంది రైతుల వివరాలు ఇస్తే ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదన్నారు. బాధిత రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే ఇకపై ఊరుకునేది లేదని ప్రభుత్వం వెంటపడతామన్నారు. క్వాలిటీ కరెంట్ ఇవ్వక, రైతు బంధు ఇవ్వక.. కాలం గడిపేస్తున్నారని ధ్వజెత్తారు. ఈ సంక్షోభానికి ఎవరు జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు. బోనస్ ఇవ్వకపోతే ఎన్నికల్లో మీకు రైతులు వాత పెడతారన్నారు. కళ్యాణ లక్ష్మి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం దొరకడం లేదా అని ప్రశ్నించారు. దళితులకు, రైతులలకు, పెంచన్ దారులకు, రుణమాఫీ, యాదవులకు, మహిళలకు మహలక్ష్మి పేరుతో, కొత్త రేషన్ కార్డు పేరుతో మోసం చేసిందే కాకుండా ఇంకా సిగ్గులేకుండా రెఫరెండం అంటున్నారని విమర్శించారు.

Advertisement

Next Story