తొమ్మిదేళ్లుగా లేని ప్రేమ సడన్ గా పుట్టుకొచ్చింది..ఎన్నికల కోసమే కేసీఆర్ డ్రామాలు..

by Naresh |   ( Updated:2023-08-17 12:14:03.0  )
తొమ్మిదేళ్లుగా లేని ప్రేమ సడన్ గా పుట్టుకొచ్చింది..ఎన్నికల కోసమే కేసీఆర్ డ్రామాలు..
X

దిశ, పటాన్ చెరు: తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ ఫైర్. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టడానికి కేసీఆర్ డ్రామాలాడుతున్నాడని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. బీసీ బందు గృహలక్ష్మి పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా పటాన్‌‌చెరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఆయన బీజేపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గత తొమిదేండ్లకు పైగా పాలనలో బీసీల సంక్షేమం పట్టని కేసీఆర్‌కు ఎన్నికలు సమీపిస్తుండడంతో హఠాత్తుగా బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. బీసీ కులాలు అంటే కేసీఆర్‌కు చులకన అని నిందించారు. బీసీ బంద్ కింద కేవలం లక్ష రూపాయలు ప్రకటించి అది కూడా కొన్ని కులాలకే పరిమితం చేశాడని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనలో పేదరికానికి కూడా కులం ఉంటుందని పేదల పట్ల అవహేళనగా మాట్లాడటం వివక్ష చూపడం కేసీఆర్ కే సొంతమన్నారు. ఎన్నికల్లో బీసీలను మాయ చేసి ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రమే సవతి తల్లి ప్రేమ చూపుతూ కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వెంటనే బీసీలకు సంబంధించిన అన్ని కులాలకి బీసీ బందు పథకం వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు ఇంటి జాగా ఉండి గృహ నిర్మాణం చేసుకుంటే రూ. 5 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ సర్కారు ఎన్నికలు సమీపించడంతో గృహలక్ష్మి పథకం పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేయాడానికి పథకాలు వెస్తున్నారని నిందించారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి కేవలం మూడు రోజుల గడువు ఇవ్వడం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనమన్నారు. 3 రోజుల దరఖాస్తు కొరకు సంబంధిత సర్టిఫికెట్లను జారీ చేయడానికి నెలలు పడుతుంటే లబ్ధిదారులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో సూచించాలని కోరారు. ఇప్పటికైనా బీసీ బందు బీసీల లోని అన్ని వర్గాల పేదలకు వివక్ష లేకుండా కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారుతొమ్మిదేళ్లుగా లేని ప్రేమ సడన్ గా పుట్టుకొచ్చింది..

ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, పటాన్ చేరు పట్టణ అధ్యక్షుడు నాగరాజు, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, పటాన్ చెరు మండల అధ్యక్షుడు కావళి వీరేశం, జిల్లా మహిళా మోర్చా నాయకురాలు సుజాత, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, పటాన్ చెరు అసెంబ్లీ కన్వినర్ రాజ్ గోపాల్ యాదవ్, యస్.ఆర్.కే యువసేన సభ్యులు షకిల్, దుర్గా సాయి, నవీన్, నరేశ్, రఘురాం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed