- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవితను తప్పించేందుకే KCR అలా చేశారు.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ నుంచి ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకు సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీకి దాసోహం అయ్యారని సీపీఐ నారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే ఓయూలో ప్రచారం చేయాలని సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి మద్దతు ఇవ్వనందుకే చంద్రబాబును జైలుకు పంపారన్నారు. కేంద్రం కాళ్లపై జగన్ పడటంతోనే పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారన్నారు. స్వతంత్ర భారతంలో ఇంతకాలం బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ మాత్రమే అన్నారు. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ దాసోహం అయ్యారన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఇక, తెలంగాణ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story