కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలు! ప్రాజెక్టుపై మరోసారి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలు! ప్రాజెక్టుపై మరోసారి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం నీళ్లను సముద్రంలో కలిపారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు. కాళేశ్వరంలో కళ్ల ముందు పోయేటువంటి 70, 80 టీఎంసీ నీళ్లను సముద్రానికి వదిలి పెట్టి నేడు చాలా పెద్ద అప్రతిష్ఠ మూట కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. నీళ్లు తేలేదు, చెరువులు నింపలేదు, చెక్ డ్యామ్‌లు నింపలేదన్నారు. కాళేశ్వరం నీళ్లు పొలాలకి ఇవ్వలేదని, లక్షల ఎకరాల్లో పొలాలు కూడా ఎండినై.. ఆ తేడా కూడా ప్రజలకు స్పష్టంగా తెలిసి పోయిందన్నారు.

రాజకీయ కుట్రతో.. కేసీఆర్‌ను బద్నామ్ చేయాలని నీళ్లు సముద్రానికి వదిలినారు.. తప్ప పొలాలకి ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారనే ఆరోపణలపై కేసీఆర్ మొదటిసారిగా స్పందించారు. దళిత ఎంపీ స్థానాలు ఉన్న చోట దళిత రిజర్వేషన్ లేకపోతే దళత ఎంపీలను గెల్వనిస్తారా? అని అన్నారు. కాబట్టి ఉద్యోగాల్లో కానీ, రాజకీయాల్లో కానీ రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని తేల్చిచెప్పారు.

Advertisement

Next Story