- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: కాంగ్రెస్ విషయంలో KCR మైండ్ ఛేంజ్.. ఆ ఒక్క ఎపిసోడ్‌తో మొత్తం సీన్ రివర్స్..?!
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాహుల్ గాంధీ ఎపిసోడ్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఎపిసోడ్ విపక్షాల ఐక్యతకు ఓ మైలురాయిగా మారుతుందా అనే చర్చ తెరపైకి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం ఆసక్తిని రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేని ప్రత్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి అవసరం అని పదే పదే చెబుతున్న కేసీఆర్.. ఇటీవల తన మనసు మార్చుకున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదానీ, రాహుల్ విషయంలో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవటం వెనుక ఇదే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్‌లోని పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయిన తీరుపై ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ.. గల్లీలో మాత్రం ఫైటింగ్‌కు దిగడం వెనుక కేసీఆర్ వ్యూహమా లేక అవసరమా అనే టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమే అని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు.
సందర్భం వచ్చిన ప్రతిసారి టీపీసీసీ రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల దుమారం రేపుతున్న టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి నేరుగా మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. దీంతో జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ రాష్ట్రానికి వచ్చేసరికి కయ్యానికి దిగడం వెనుక ఏం జరుగుతోందనేది చర్చనీయాంశం అవుతోంది.
అయితే, గతంలో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రగతి భవన్ మీది కాకి గాంధీ భవన్‌పై, గాంధీభవన్ మీది కాకి ప్రగతి భవన్ మీద వాలడానికి వీళ్లేదని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన పొత్తుల వ్యాఖ్యలపై కూడా భిన్న స్వరాలు వినిపించాయి. ఎవరితో పొత్తు ఉండబోదని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. ఇదే సమయంలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కుమారస్వామి వంటి వారు థర్డ్ ఫ్రంట్ విషయంలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇంతలోనే రాహుల్ గాంధీ సస్పెన్స్ వ్యవహారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ హాజరుకావడం, హస్తం పార్టీకి కేసీఆర్ నైతికంగా మద్దతు నిలవడం వెనుక కేసీఆర్ తన వైఖరి మార్చుకున్నారా అనే చర్చ జరుగుతోంది. గట్టిగా ప్రయత్నిస్తే ప్రధాని పదవి విషయంలో హస్తం పార్టీని వెనక్కి తగ్గేలా చేయవచ్చనే కేసీఆర్ భావిస్తున్నారా అనేది ఉత్కంఠ రేపుతోంది. మరో వైపు రాష్ట్రంలో హంగ్ తప్పదని.. అదే జరిగితే బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మద్దతు అవసరం అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ వైఖరిలో కనిపిస్తున్న మార్పు దేనికి సంకేతమో కాలమే సమాధానం చెప్పనుంది.