బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కేసీఆర్.. కాసేపట్లో ప్రకటన

by GSrikanth |
బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కేసీఆర్.. కాసేపట్లో ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: శాసనసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీ సెషన్ ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతున్నది. ఇందుకోసం ప్రొటెమ్ స్పీకర్‌గా ఇప్పటికే అక్బరుద్దీన్ ఒవైసీ రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, ప్రొటోకాల్ డైరెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో పదేళ్లుగా పాలకపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష స్థానంలో కూర్చోనుంది. దీంతో ఇవాళ బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. దీనిపై కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో తీర్మాణం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed