ఏయ్ దొంగా అడ్డంగా దొరికిపోయావ్.. ఫోన్ ట్యాపింగ్‌పై KCR ఆన్సర్‌.. T-కాంగ్రెస్ సెటైర్లు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-24 14:25:59.0  )
ఏయ్ దొంగా అడ్డంగా దొరికిపోయావ్.. ఫోన్ ట్యాపింగ్‌పై KCR ఆన్సర్‌.. T-కాంగ్రెస్ సెటైర్లు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పిన ఆన్సర్‌పై టీ-కాంగ్రెస్ సెటైర్లు వేసింది. ప్రభుత్వం ట్యాపింగ్ చేశారని.. ప్రైవేటు లైఫ్‌ల్లోకి వెళ్లారని ఇది ధర్మమేనా.. పద్ధతేనా అని మాట్లాడుతున్నారు కదా అని యాంకర్ ప్రశ్నించారు. రాజకీయ అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నారా అనే ప్రశ్నకు మీ ఆన్సర్ ఏంటి అని సూటిగా యాంకర్ అడగడంతో మాజీ సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. రాజకీయ అవసరాలకు వాడామా లేదా అన్నది తనకే తెలియదన్నారు. అయితే ఈ వీడియోను ఎడిట్ చేసి టీ- కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Click Here for Twitter video లింక్

Read More...

వాళ్ల సంగతి చూద్దాం.. రైతులకు కేసీఆర్ భరోసా

Advertisement

Next Story
null