- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కడ KCR.. ఇక్కడ KTR.. బీఆర్ఎస్ బలోపేతంపై తండ్రి కొడుకుల ఫోకస్!
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ బలోపేతంపై తండ్రి కొడుకులు ఫోకస్ పెట్టారు. జాతీయ రాజకీయాల్లో రాణించాలని కేసీఆర్ స్పీడ్ పెంచగా, రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ యాక్టివిటీస్‌ని ముమ్మరం చేశారు. ఇద్దరి లక్ష్యం పార్టీ బలోపేతమే. టార్గెట్ రాబోయే ఎన్నికలు. సత్తా చాటేందుకు కార్యాచరణను ముమ్మరం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణ లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా మహారాష్ట్రపై స్పీడ్ పెంచారు. ఇప్పటికే నాందేడు, కాంధర్ లోహ, ఔరంగాబాద్‌లో బహిరంగ సభలు నిర్వహించారు. గత రెండు నెలలుగా మహారాష్ట్రపై ప్రత్యేక కార్యచరణలతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఆ రాష్ట్రంలోని ఇతర పార్టీ నేతలను గులాబీ గూటికి చేర్చుతున్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలకు బీఆర్ఎస్ కండువాలు కప్పి.. పార్టీ ఎజెండాను వివరిస్తున్నారు.
అందులో భాగంగానే ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ భవన్ వేదికగా మహారాష్ట్రలోని నాయకులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని 288 నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు వేసేందుకు కసరత్తును ప్రారంభిస్తున్నారు. అందుకు ఈనెల 8 నుంచి వచ్చే నెల 8 వరకు టార్గెట్‌ను నిర్దేశించారు. సభ్యత్వ రుసుమును కూడా నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని అధినేత కేసీఆర్ ఆ రాష్ట్ర నేతలకు ఆదేశించారు. పూర్తిగా మహారాష్ట్రపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టారు.
తెలంగాణపై కేటీఆర్..
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. అందులో భాగంగానే పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని పార్టీ నేతలతో.. టెలి కాన్ఫరెన్స్, మీడియా ద్వారా ఆదేశించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జనరల్ బాడీ మీటింగ్ సైతం దగ్గరుండి విజయవంతం చేశారు.
పార్టీ కార్యక్రమాలపై శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ కేడర్ను సమయత్తం చేస్తున్నారు. ఇద్దరి నేతల టార్గెట్ పార్టీ బలోపేతమే. రాబోయే స్థానిక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాలని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
Read more:
బిగ్ న్యూస్: ఏపీలో ఎంట్రీకి కేసీఆర్ కొత్త స్కెచ్.. ఆ ఇష్యూపై BRS సడెన్ యూటర్న్!
బిగ్ న్యూస్: మహారాష్ట్రపై కన్నేసిన KCR.. BRS బలోపేతానికి గులాబీ బాస్ నయా వ్యూహం!