నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!

by Satheesh |   ( Updated:2024-05-07 16:13:15.0  )
నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు దర్యా్ప్తు సంస్థల అధికారులు ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు. తనను నేరుగా కోర్టులో హాజరుపర్చాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కవిత దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అధికారులు ఆమెను మధ్యాహ్నం నేరుగా కోర్టులోనే ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈ కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని.. కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను మరోసారి పొడగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరనున్నట్లు సమాచారం. దీంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదోనని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read More...

ప్రజ్వల్‌ను దేశం దాటించి.. నన్ను అరెస్ట్ చేయడం దారుణం: MLC కవిత సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed