హైదరాబాద్‌కు చేరుకున్న కవిత

by Mahesh |
హైదరాబాద్‌కు చేరుకున్న కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వరుసగా రెండు రోజుల ఈడీ విచారణ ఎదురుకొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కవిత, కేటీఆర్ బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఈ కేసులో కవిత ఇప్పటి వరకు మూడు రోజుల్లో 29 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు.

నిన్న 10 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. తదుపరి విచారణ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఇవాళ విచారణ లేకపోవడంతో ఆమె హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. మరోవైపు ఇవాళ ఉదయం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన భర్త అనిల్‌తో కలిసి ఉన్న ఫోటోను ఈ సందర్భంగా కవిత షేర్ చేశారు.

Advertisement

Next Story