పార్టీకి పూర్వవైభవం తేవడానికే ఆవిర్భావ సభ

by GSrikanth |
పార్టీకి పూర్వవైభవం తేవడానికే ఆవిర్భావ సభ
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీకి పూర్వ వైభవం తేవడానికే పార్టీ ఆవిర్భావ సభను హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ నెల 29న నిర్వహిస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్, చేవేళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సభ విషయవంతానికి జనసమీకరణ, ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజూ గ్రామస్థాయిలో పార్టీ జెండాలు ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి కంభంపాటి రామ్మోహన్ రావు, మీడియా వ్యవహరాల కోఆర్డినేటర్ బయ్యని సురేష్, నాయకులు నర్సిరెడ్డి, ప్రేమ్ కుమార్ జైన్, జ్యోత్స్న, ప్రసూన తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ సంబురాలు...

ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో ఎన్టీఆర్ భవన్‌లో సంబురాలు నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసి, పటాకులు కాల్చారు. రాబోయే ఎన్నికల్లో రెండు తెలుగురాష్ట్రాల్లో టీడీపీ విజయఢంకా మోగించబోతుందని కాసాని పేర్కొన్నారు. కార్యక్రమంలో భూపాల్ రెడ్డి, మస్కతి, రాజునాయక్, జీవీజీనాయుడు, ఆరీఫ్, సాయిబాబా సతీష్, పొగాకు జయరాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed