- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు టీడీపీ ప్రెసిడెంట్ ఓపెన్ లెటర్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం భూమి ఇచ్చినట్లు రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలన్నింటికీ భూమిని కేటాయించాలని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కోరారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన విధంగానే తెలుగుదేశం పార్టీకి సైతం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ భవన నిర్మాణానికి కోకాపేట్‌లో గజం రూ. 7,500 లకు 11 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. అదే విధంగా 33 జిల్లాల్లో గజం రూ.100 చొప్పున బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన స్థలాలను తెలుగుదేశం పార్టీకి సైతం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ జూలై, ఆగస్టు నెలల్లో 2018 సంవత్సరంలో ఆయా జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు చేసినా ఇంతవరకు ఒక్క చోట కూడా స్థలం కేటాయించలేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించి నాలుగు సంవత్సరాలైనా, ఇతర పార్టీలకు స్థలాలు కేటాయించకపోవడం పూర్తిగా అన్యాయమన్నారు. హైదరాబాద్ నగరంలో రెండు చోట్లా రాష్ట్రంలో 33 జిల్లాల్లో మీ పార్టీకి స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని మరే పార్టీకి సెంటు స్థలం కూడా కేటాయించక పోవడం పక్షపాత వైఖరితో కూడుకున్నదని విమర్శించారు. ప్రభుత్వం అన్ని పార్టీలను సమదృష్టితో చూడాల్సిన అవసరమున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజకీయ కార్యకలాపాలు సాగించడం లేదని, అన్ని పార్టీలు రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నాయని తెలిపారు. కనుక ఇతర పార్టీలకు సైతం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన విధంగానే సత్వరం స్థలాలు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.