- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌కు ఓటు వేయకండి.. తెలంగాణలో కర్ణాటక రైతుల నిరసనలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు నిరసన సెగ తగిలింది. కర్ణాటక రైతుల నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకత వ్యక్తవుతోంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కర్ణాటక రైతులు తెలంగాణలో నిరసనలు చేపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని కోరుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చలేదని, ఆ పార్టీకి ఓటు వస్తే కర్ణాటక పరిస్థితే తెలంగాణకు ఎదురవుతుందని ప్లకార్డులు ప్రదర్శిస్తూ కర్ణాటక రైతులు పలుచోట్ల ర్యాలీలు చేపడుతున్నారు. ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ పరిణామం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలను షాక్‌కు గురి చేస్తోంది.
శనివారం వికారాబాద్ జిల్లాలోని పరిగిలో కర్ణాటక రైతులు ఆందోళనకు దిగారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించగా.. హస్తం పార్టీ నేతలు గమనించి వారిని అడ్డుకున్నారు. ప్లకార్డులను లాక్కోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిగిలో రేవంత్ రెడ్డి రోడ్ షోకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది.
అటు నారాయణఖేడ్‌లో కూడా కర్ణాటక రైతులు నిరసన చేపట్టారు. తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని ఆందోళన చేపట్టారు. దీంతో వారిని కాంగ్రెస్ నేతలు అడ్డుకోగా.. ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇలా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు కర్ణాటక రైతుల నిరసనలు ఎదురవుతున్నాయి.