- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Chandrababu: మహిళ ఇంట్లో టీ కాచిన సీఎం చంద్రబాబు.. తక్షణమే రూ.2 లక్షలు
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోన్న కూటమి ప్రభుత్వం.. నేడు ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas Cylinder) పంపిణీని ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) శ్రీకాకుళం జిల్లా ఈదుపురం గ్రామంలో శాంతమ్మ అనే మహిళకు.. ఆమె ఇంటికెళ్లి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ను అందించారు. అంతేకాదు.. ఆమె ఇంటిలోనే టీ కాచారు. స్వయంగా సీఎం వచ్చి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, తన ఇంట్లో పొయ్యిని వెలిగించి టీ కాయడంతో శాంతమ్మ ఆనందానికి అవధుల్లేవు. సీఎం వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
అనంతరం బడేపల్లిలో ఉన్న శాంతమ్మ ఇంటికెళ్లి ఒంటరి మహిళ పెన్షన్ ను అందజేశారు. అయితే ఆమె మందులకు, వైద్యానికి ఈ పెన్షన్ చాలా ఉపయోగపడుతుంది కానీ.. ఇంకా అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడి.. జనరిక్ మెడిసిన్స్ అవసరమైన వారికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె మందులకు తక్షణమే రూ.2 లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు. వెంటనే శాంతమ్మ కన్నీటి పర్యంతమైంది. ఇంతవరకూ ఒక్క నేత కూడా తనకు సహాయం చేయలేదని.. తమను ఆదుకున్న దైవం చంద్రబాబు అని భావోద్వేగానికి గురైంది.