- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో చేరికలకు కర్ణాటక ఫలితాలతో లింక్?
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎల్లుండి వెలువడబోతున్న రిజల్ట్స్‌లో కన్నడిగులు ఎవరికి పట్టం కట్టారో తేలిపోనుంది. అయితే కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సాధించబోయే ఫలితాలు తెలంగాణలో మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ వచ్చే ఫలితాలే రేపు తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా సైలెంట్ అయిన పార్టీల్లో చేరికల అంశం మే 13 తర్వాత తిరిగి పుంజుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ఏ పార్టీ చక్రం తిప్పుతుందో తెలంగాణలో ఆ పార్టీలోకి చేరికలు ఉండే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జ్ పార్టీగా అవతరించబోతోందని అంచనాలు వేసిన నేపథ్యంలో అదే ఫలితం వస్తే గనుక తెలంగాణలో ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీ నేతలు ఆసక్తి చూపే ఛాన్స్ ఉందంటున్నారు. లేదా బీజేపీనే తిరిగి అధికారంలోకి వస్తే కమమం పార్టీలో చేరికలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కేసీఆర్ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పోటా పోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. పలువురు ప్రముఖులను తమ వైపు ఆకర్షించేందుకు ఇరు పార్టీ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయినా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ప్రభావం కారణంగా చేరికల విషయంలో నేతలు పెద్దగా ఆసక్తి చూపినట్లు కనిపించడం లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు లాంటి సీనియర్ నేతలు ఇప్పటికే బీఆర్ఎస్‌పై అసమ్మతి రాగం ఆలపించినప్పటికీ వారు ఏ పార్టీ కండువా కప్పుకుంటారనేది స్పష్టత లేదు. దీంతో వారి నిర్ణయం ఉత్కంఠ రేపుతన్నది. అయితే ఎల్లుండి వెలువడే కర్ణాటక ఫలితాల అనంతరం వారు ఓ నిర్ణయానికి రావచ్చనే టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రముఖ లీడర్లు సైతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ప్రయత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది.