- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరెవ్వా.. వెరైటీ వెడ్డింగ్ కార్డ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ పెండ్లి పత్రిక
దిశ, మల్యాల: ప్రతి ఒక్కరి వైవాహిక జీవితానికి తొలి సంతకం శుభలేఖ. కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో జరిగే వేడుకకు వివాహ ఆహ్వాన పత్రిక ముద్రించి ఇచ్చి పిలవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అలాంటి ఆనవాయితీలో భాగంగా మల్యాలకు చెందిన యువకుడు వెరైటీగా ఆలోచన చేశాడు. ఫోక్ సాంగ్స్ రైటర్, సింగర్ గా రాణిస్తున్న పొన్నం మహేష్ గౌడ్ అనే యువకుడు తన ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ పేరునే ఇంటిపేరుగా మార్చుకొని స్థానికంగా గుర్తింపు పొందాడు. తెలంగాణ యాస, భాషకు ప్రత్యేక స్థానం కల్పించే విధంగా మహేష్ తన వివాహానికి సంబంధించిన పెళ్లి పత్రికను వినూత్న రీతిలో ఆలోచించి తెలంగాణ యాస ఉట్టిపడేలా తయారు చేయించాడు. దీంతో ఆ వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 24న, బుధవారం జరగబోయే వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పత్రికను చూసి సృజనాత్మకతతో ఆలోచించి తెలంగాణ యాస, భాష ఉట్టిపడేలా ఉన్న వెరైటీ వెడ్డింగ్ కార్డును చూసిన మహేష్ గౌడ్ మిత్రులు, బంధువులు, ప్రతి ఒక్కరూ అతడిన ప్రశంసిస్తున్నారు.
Also Read..
‘‘కులాన్ని మతాన్ని కాదు మానవత్వాన్ని నమ్మండి’’ అంటూ వైరల్ అవుతున్న పెళ్లి కార్డు