అన్ని రంగాల కార్మికులు హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆర్ .వీ కర్ణన్

by Shiva |
అన్ని రంగాల కార్మికులు హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలి  :  కలెక్టర్ ఆర్ .వీ కర్ణన్
X

దిశ, కరీంనగర్ టౌన్ : అన్ని రంగాల కార్మికులు హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ సూచించారు. సోమవారం మే డే సందర్భంగా కార్మిక ఆత్మీయ సంబరాల్లో భాగంగా కృషి భవన్ లో సీఎల్పీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మిక ఆత్మీయ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

భవన, ఇతర నిర్మాణ కార్మికుల కోసం మూడు రోజుల పాటు మే 1 నుంచి 3 వరకు నిర్వహించు హెల్త్ క్యాంపును కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులు ఉన్న భవన నిర్మాణ కార్మికులకు కార్మిక ఆత్మీయ సంబరాల్లో భాగంగా మే1 నుంచి 3 వరకు సీఎస్సీ ఆధ్వర్యంలో రూ.3,200 విలువైన ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సంక్షేమ పథకాలు సహజ మరణం కింద ఒకరికి 1,30,038 చొప్పున మొత్తం 20 మంది లబ్ధిదారులకు, రూ.26,00,769 లను వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రసూతి లబ్ధి కింద ఒక్కొక్కరికి రూ.30,038 చొప్పున 161 మంది లబ్ధిదారులకు రూ.48,36,118 లబ్ధిదారులను, వివాహ కానుక కింద ఒక్కొక్కరికి రూ.30,038 చొప్పున 42 మంది లబ్ధిదారులకు రూ.12,61,596లకు జమ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సంబంధిత లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన కార్మిక సంక్షేమ పథకాల గురించి కార్మికులకు వివరించారు. జిల్లా హ్యాండ్లూమ్ శాఖాధికారి జి.సంపత్ జౌళి శాఖలోని 118 మంది లబ్ధిదారులకు రూ.8,44,000 చెక్కు రూపంలో కార్మికులకు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, జిల్లా చేనేత శాఖ అధికారి సంపత్ కుమార్, సీఎస్సీ హెల్త్ కేర్ కో-ఆర్డినేటర్ బాబ, సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్లు, కార్మిక శాఖాధికారులు నజీర్ అహ్మద్, చక్రధర్ రెడ్డి, చందన, వివిధ రంగాల కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed