- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈటలపై ఆదయ పన్ను కమిషనర్ కు ఫిర్యాదు చేస్తా: ప్రభుత్వ విఫ్ కౌశిక్ రెడ్డి
దిశ, హుజూరాబాద్: ఈటలపై ఆదయ పన్ను కమిషనర్ కు ఫిర్యాదు చేస్తానని ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2021 లో జరిగిన ఉప ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుండా అడ్డుకునేందుకు వివేక్ వెంకటస్వామి ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చినట్లు నియోజవవర్గంలోని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. అదే విషయాన్ని ఈటల నోటి ద్వారా విన్నామని తెలిపారు.
రెండేళ్ల క్రితమే తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా రేవంత్ రెడ్డితో ఈటలతో కుమ్మక్కై కుట్ర పన్నారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ లో బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పోరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, ఎంసీసీ ఇరుమళ్ల రాణి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.