- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణకు కృషి చేస్తాం : మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
దిశ, రామగిరి : సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు కృషి చేస్తామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం సెంటిమెంట్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో వివిధ యూనియన్లకు చెందిన పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులు ఐఎన్టీయూసీ యూనియన్ లో చేరగా శ్రీధర్ బాబు వారికి కండువాలు కప్పి యూనియన్లకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిండు అసెంబ్లీ సాక్షిగా.. సీఎం కేసీఆర్ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరని మాట్లాడడం కాంట్రాక్టు కార్మికుల పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, తాము అధికారంలోకి రాగానే ఏర్పడగానే పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఐఎన్ టీయసీఆర్జీ త్రీ ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకులు ధర్మపురి, ఉడుత శంకర్, ఉయ్యాల కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు.