కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం : మంత్రి గంగుల కమలాకర్

by Shiva |
కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం : మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలో 14.5 కి.మీ. మేర బీటీ రోడ్డు, ధ్వంసమైన డివైడర్లను పునరుద్ధరణ పనులను రూ.1 కోటితో చేపడుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.మంగళవారం కోర్టు చౌరస్తాలో పునరుద్ధరణ పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లతో నగరంలో 14.5 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టిందని తెలిపారు.

మున్సిపల్ వాటర్ పైప్ లైన్ లీకేజీ, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కోసం పలుచోట్ల గుంతలు పడ్డాయని తెలిపారు. ప్రమాదాల వల్ల డివైడర్లు కూలిపోయాయని తెలిపారు, వాటి పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. అందులో భాగంగా రూ.1 కోటి డివైడర్ల సుందరీకరణ కోపింగ్ పనులను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో కోపింగ్ స్క్వేర్ మోడల్ లో ఉండేదని దానిని ఆఫ్ కర్వ్ మోడల్ గా తీర్చిదిద్దామన్నారు. గతంలో రోడ్డు పనులు రెన్యువల్ చేయాలంటే 15 నుంచి 20సంవత్సరాలు పట్టేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లకు రోడ్ల పునరుద్ధరణ పనుల కోసం నిధులు కేటాయిస్తుందన్నారు.

డివైడర్లకు పునరుద్ధరణ తర్వాత నగరం మొత్తం మళ్లీ బీటీ రోడ్డు వేస్తామని వెల్లడించారు. బీటి రోడ్డు నిర్మాణం అనంతరం రోడ్ సేఫ్టీతో వైట్ జీబ్రా మార్కింగ్స్, స్టడ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు దిండిగాల మహేష్ , తోట రాములు గుగ్గిల జయశ్రీ, నాంపల్లి శ్రీనివాస్, గందే మహేష్, వంగల పవన్, కొలిపాక శ్రీనివాస్ ఆర్ అండ్ బీ ఈఈ సాంబశివరావు, డిరవీందర్, ఏఈ లక్ష్మణ్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story