ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం : మంత్రి శ్రీధర్ బాబు

by Disha Web Desk 11 |
ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ,గొల్లపల్లి/పెగడపల్లి : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ లను కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఇప్పటికే నాలుగు గ్యారంటీ లను అమలు చేశామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం రోజున గొల్లపల్లి,పెగడపల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయని బిఆర్ఎస్ నాయకులు నాలుగు నెలల కాంగ్రెస్ పాలన మీద విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.

గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎకరానికి అయిదు వేల రైతు బంధు ఇచ్చి ధాన్యం కొనుగోలు సమయంలో తప్ప, తాలు పేరుతో పన్నెండు వేల రూపాయలు దోచుకున్నారని ద్వజమెత్తారు. ఇక్కడి ప్రాంత రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తామని అందుకోసం ఎన్నో ఎండ్లుగా పరిష్కారం కానీ పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీ లో బాగంగా రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ఆగస్టు పదిహేను లోపు చేసి తీరుతామని ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నాకు తోడుగా ఎంపీ గా గడ్డం వంశీని గెలిపిస్తే నియోజక వర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ,గొల్లపల్లి,పెగడపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిశాంత్ రెడ్డి,బుర్ర రాములు గౌడ్,జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ కటారి చంద్ర శేఖర్ రావు, నాయకులు భీమ సంతోష్,నేరెళ్ల మహేష్, ఒరుగలి శ్రీనివాస్,సంధి మల్లారెడ్డి,అమిరిశెట్టి మల్లారెడ్డి, సంధి మల్లారెడ్డి,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed