BREAKING: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు ఎగనామం పెట్టిన ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ

by Shiva |   ( Updated:2024-05-20 08:37:44.0  )
BREAKING: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు ఎగనామం పెట్టిన ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ
X

దిశ, వెబ్‌డెస్క్: దాచి.. దాచి దయ్యాల పాలు చేసినట్లు అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది సామాన్యులు ప్రైవేటు ఫైనాన్స్‌లో రూ.కోట్లు డిపాజిట్ చేశారు. కానీ, రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేసి వారి నోట్లో మట్టికొట్టిన ఘటన హైదారబాద్‌ నగరంలోని ఆబిడ్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అబిడ్స్‌లోని శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ సంస్థ తమ వద్ద పెట్టుబడి పెడితే.. మార్కెట్‌లో ఉన్న వడ్డీ రేటు కంటే అధికంగా చెల్లిస్తామని నమ్మబలికింది. అదేవిధంగా సంస్థ నుంచి ఎజెంట్లను నియమించుకుని సామాన్యుల నుంచి రూ.200 కోట్ల మేర డిపాజిట్లను సేకరించింది. అనంతరం రాత్రికి రాత్రే అందిన కాడికి దండుకుని సంస్థ ప్రతినిధులు ఏకంగా బోర్డు తిప్పేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్ సీసీఎస్ పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. దాదాపు 517 మంది ఇప్పటి వరకు శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్లు చేసినట్లుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed