- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Brahmamudi: బాబు ఆచూకీ తెలుసుకున్న కావ్య.. ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేస్తుందా
దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
బాబు తల్లి గురించి నీకు అంతా తెలిసిపోయిందని నాకు ముందే తెలుసు అంటూ కావ్యతో రాజ్ అంటాడు. దీంతో ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. ఆపు ఇంక నీ నాటకాలు ..నేను చెప్పేది విను.. నువ్వు ఏం తెలుసుకున్నావో అది నీ మనసులోనే ఉంచుకో.. దయచేసి ఎవరికీ చెప్పకు అని రాజ్ అంటాడు.
కానీ, కావ్య మాత్రం అసలు కుదరదు కోపంగా చెబుతుంది. అంటే .. నీ ఉద్దేశం ఇప్పుడు ఆ మాయను ఇంటికి తీసుకు వచ్చి.. మా అమ్మానాన్నలను వేరు చేస్తావా అంటూ రాజ్ అడుగుతాడు. అది కాదు.. అసలు ఆ మాయ ఇది అంతా ఎందుకు చేస్తుందో తెలిసుకోవడమే నా లక్ష్యం.. అయినా కన్నబిడ్డను ఇలా ఎలా వదిలేసింది.. మళ్లీ నెలకు రూ.10 లక్షలు తీసుకుంటూ.. కూడా అజ్ఞాతంలో బతకాల్సిన అవసరం ఏంటని కావ్య అడుగుతుంది. దీంతో రాజ్ ఏమి మాట్లాడాలో తెలియక సైలెంట్ అవుతాడు.
ఇప్పుడు అవన్నీ నీకు అవసరం లేదు.. నువ్వు ఇప్పుడు ఆ మాయను దగ్గరికి వెళ్తే.. ఆమె మన ఇంటికి వచ్చి మా నాన్న పరువు మొత్తం తీస్తుంది అంటూ రాజ్ గట్టిగా అరిచి చెబుతాడు. మీరు ఎన్ని చెప్పినా నేను మీ మాట వినను.. ఆమె ఎక్కడ ఉన్నా కనిపెడతాను అని కావ్య సీరియస్ గా చెబుతుంది.