మా భూములు మాకే కావాలి

by Sridhar Babu |
మా భూములు మాకే కావాలి
X

దిశ, మేడిపల్లి : కలికోట సూరమ్మ చెరువు కుడికాలువ నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం వారం రోజుల క్రితం ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ మంగళవారం రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామసభను బహిష్కరించారు. గోవిందారం రెవెన్యూ పరిధిలోని గోవిందారం, దేశయిపేట, రాజలింగంపేట భూ నిర్వాసిత బాధితులందరూ కలిసి ఈ భూసేకరణ నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ భూసేకరణలో పూర్తిగా చిన్న, సన్న కారు రైతులు ఉన్నామని తమ కుటుంబం జీవనాధారం ఈ భూములపై ఆధారపడి ఉందని, తమ కుటుంబ పోషణ జరగాలంటే ఈ భూములే మాకు ఆధారమని తెలిపారు.

భూమి ఇచ్చేందుకు అంగీకరించమని గ్రామ సభను బహిష్కరిస్తూ ఎలాంటి సంతకాలు చేయకుండా ఏకవాక్య తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మార్వోకు బాధితులు అందరూ కలిసి భూ సేకరణ నిలుపుదల చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ రద్దు చేయాలని వినతిపత్రం అందించారు. ఈ చెరువుల నింపుటకు అవసరమైతే గత ప్రభుత్వం సర్వే చేసిన విధంగా వరద కాలువ పునర్జీవ పథకం కింద ఎత్తిపోతల ద్వారా కథలాపూర్ మండలానికి దోంపెట వరద కాలువ నుండి భీమారం, మేడిపల్లి మండలాలకు, రంగాపూర్ వరద కాలువ నుండి లిఫ్టు ద్వారా చెరువులు నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు బందెల మల్లయ్య, ఏనుగు సత్యం రావు, గోపు మల్లయ్య, ఏనుగు అనంతరెడ్డి, కె. అంజిరెడ్డి, కె. గంగారెడ్డి, నారాయణరెడ్డి, భూమక్క, జక్లేటి భూమారావు, బండపెళ్లి గంగరాజము, ఎండీ. జమీల్, బందెల మల్లేశం, బాల్సాని రవి, కోరేపు భూమయ్య, కారండ్ల మధుకర్, దొంతి మురళి, నాంచారి రాజేందర్, అన్నాడి జలపతి రెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed