- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గొంతు నొక్కాలనుకుంటే తిరుగుబాటు తప్పదు: కేంద్రంపై వినోద్ కుమార్ ఫైర్
దిశ, హుజూరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. కుంటి సాకులతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ముందు చూపుతో కేసీఆర్ ప్రభుత్వం ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కమ్యూనిటీ స్టోరేజి కింద కళ్లాలు నిర్మించిందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కల్లాలు నిర్మించుకున్న 40 వేల 199 మందికి విడుదల చేసిన 150 కోట్ల రూపాయలను రాష్ట్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ నిధులను రికవరీ చేయడంతోనే రైతులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమైందన్నారు. దేశంలోనే రైతాంగ సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిన రాష్ర్టాభివృద్జి విషయంలో రాజీ పడేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రికవరీ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాలు రాష్ర వ్యాప్తంగా నిర్వహించామన్నారు.
రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడితే జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు చూపుతోనే రాష్ట్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తుంచుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. అభివృద్ధి విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం నేటికీ దేశంలో గ్రామాలన్నిటికీ విద్యుత్ సౌకర్యం ఇవ్వలేక పోయిందని విమర్శించారు.
అంధకారంలో ఎన్ని పల్లెలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ గొంతు నొక్కాలని చూసిన, అభివృద్ధి విషయంలో ఆటంకాలు సృష్టించిన చైతన్య వంతులైన తెలంగాణ ప్రజల నుంచి తిరుగు బాటు తప్పదన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ బండ శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు పడిదం బక్కారెడ్డి, హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, వడ్లూరి విజయ్ కుమార్, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.