- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిషన్ భగీరథ అధికారుల తీరు.. గ్రామస్తులు వినూత్నంగా నిరసన
దిశ, రామడుగు: మిషన్ భగీరథ కలుషిత నీటితో ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఏకంగా కలుషిత నీటితో గ్రామస్తులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. రామడుగు మండలంలోని గుండి గ్రామంలో కొద్ది రోజుల నుండి మిషన్ భగీరథ నీరు కలుషితమై వస్తున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నా... కనీస స్పందన లేకుండా పోతుంది. దీంతో కలుషిత నీటితో ఏకంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. కలుషిత నీటిని తాగడంతో గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పాలక వర్గం నుండి ఎన్నిసార్లు మిషన్ భగీరథ డిఈని ఫోన్లో సంప్రదించిచా.. కనీస స్పందన లేకుండా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా నీరు వస్తున్నాయని అధికారులకు తెలపగా.. నిర్లక్ష్యపు సమాధానంతో స్పందిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై త్వరగా స్పందించి నీటిని కలుషితం కాకుండా గ్రామస్తులకు సప్లై చేస్తేనే బాగుంటదని, లేకుంటే సంబంధిత అధికారులు గ్రామాలలోకి రాకుండా తరిమి కొడదామని ఈ సందర్భంగా ఆందోళనకారులు డిమాండ్ చేశారు.