- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ ఆశయాలను అమలు చేసినప్పుడే నిజమైన నివాళి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి: అంబేద్కర్ ఆశయాలను అమలు చేసినప్పుడే నిజమైన నివాళి అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జీవన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం అభినందనీయమన్నారు.
అయితే, కేవలం విగ్రహ ఆవిష్కరణతో సరిపెట్టకుండా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయాలని సూచించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు వెచ్చించకుండా దళితులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ రూపొందిస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ అభివృద్ధి నిధులుగా పేరు మార్చారని తెలిపారు.
దళితుల అభివృద్ధికి కేటాయించిన నిధులు మరో ఏడాదికి మల్లించకుండా అదే ఏడాదిలో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.