- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాల్స్ ఎదుట వాహనాల పార్కింగ్.. రోడ్లపై తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్య
దిశ, కరీంనగర్: కరీంనగర్ నగరంలో నూతనంగా నిర్మించే బహుళ అంతస్తుల భవనాల యజమానులు బాధ్యాతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సెట్ బ్యాక్ లేకుండా, పార్కింగ్ స్థలం కేటాయించకుండా షాపింగ్ మాల్స్, ఆస్పత్రుల భవనాలు నిర్మిస్తున్నారు. వ్యాపారసముదాయ భవనాలు నిర్మిస్తున్నారు. కట్టడి చేసి క్రమబద్దీకరించాల్సిన కార్పొరేషన్ అధికారులు కరెన్సీ నోట్లకు అలవాటుపడి నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భవనాల యజమానుల బాద్యతారాహిత్యం బల్దియా అధికారుల నిర్లక్ష్యంతో బల్దియా ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతోంది. అంతేకాక ఇరుకైన రోడ్లతో అడుగడుగునా ట్రాఫిక్ అంతరాయంతో భవిష్యత్‌లో నగర జీవనం నరకప్రాయం కానుంది.
కనిపించిన సెట్ బ్యాక్..
బల్దియా అధికారులు, ఖద్దరు నేతలు కరెన్సీ నోట్లకు కట్టుబడి పనిచేయడంతో నగరంలో అడుగడుగున నిబంధనలు ఉల్లంఘిస్తూ బహుళ అంతస్తులు వెలుస్తున్నాయి. ఈ అంతస్తులతో బల్దియా ఆదాయానికి నష్టం వాటిల్లుతుండగ నగరంలో ప్రధాన కూడళ్లలో నిర్మిస్తున్న భవనాలు నగర ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నగరంలో వ్యాపార, వాణిజ్య సముదాయాల భవనాలు సెట్ బ్యాక్ లేకుండా వాహనాల పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా రోడ్లను ఆక్రమిస్తు నిర్మిస్తున్నారు. దీంతో కొద్దిపాటి జనంతోనే ప్రధాన కూడళ్లు రద్దీగా మారుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రధానంగా ఈ ప్రభావం నగరంలోని టవర్ ఆస్పత్రి కమాన్ బస్టాండ్ ఏరియాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుండగా మంకమ్మతోట, రాంనగర్, విద్యానగర్, శివ థియేటర్ ఏరియాల్లో సైతం నిత్యం ట్రాఫిక్ జాము అవుతుండడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు.
రోడ్లు, ఖాళీ ప్రదేశాలే పార్కింగ్ స్థలాలు..
నగరంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలకు వచ్చే వాహనాలు అక్కడ ప్రత్యేక పార్కింగ్ స్థలాలు లేవు. దీంతో రోడ్లు ఖాళీ స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్లన్నీ వాహనాల పార్కింగ్‌తో నిండిపోతూ సాధారణ జనం రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అవసరాల నిమిత్తం ఆయా ప్రాంతాలకు రావాలంటే అక్కడ అడుగుపెట్టే స్థలం లేక వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎమ్మర్జెన్సీ పరిస్థితుల్లో ఎవరైనా అటు వెళ్తేందుకు సాహసం చేస్తే గంటల తరబడి ట్రాఫిక్ దిగ్బంధనంలో ఇరుక్కు పోవాల్సిందే. ఇలా అడుగడుగునా ట్రాఫిక్ ఇబ్బందితో నగరవాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణేది?
నగరంలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవడంతో నగరవాసులు ట్రాఫిక్ సమస్య నియంత్రించేదెవరని ప్రశ్నిస్తున్నారు. బల్దియా అధికారులు ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం, ట్రాఫిక్ స్తంభించినా ట్రాఫిక్ పోలీసులు స్పందించకపోవడంపై నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఈ సమస్యను పరిష్కరించేది ఎవరు అని పాలకుల తీరుపై మండిపడుతున్నారు.