గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత.. ఒకరి మృతి..!

by Nagam Mallesh |
గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత.. ఒకరి మృతి..!
X



దిశ, మెట్ పల్లిః పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో సంచలన ఘటన జరిగింది. ముగ్గురు విద్యార్థులకు అస్వస్థతకు గురి కాగా.. ఓ విద్యార్థి ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసలు ఈ పాఠశాలలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పది రోజుల క్రితమే ఒక విద్యార్థి పాముకాటుకు గురైన ఘటన మరవకముందే మళ్ళీ అదే పాఠశాలలో అస్వస్థతతో విద్యార్థి చనిపోవడం కలకలం రేపుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు 6వ తరగతి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన అనిరుద్ తెల్లవారుజామున 3 గంటలకు కడుపు నొప్పితో బాధపడగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే అతను చనిపోయాడు. మెట్ పల్లి మండలం ఆత్మకూర్ చెందిన మోక్షిత్ ను నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మల్యాల మండలం తాటి పెళ్లి గ్రామానికి చెందిన హేమంత్ యాదవ్ కు స్థానిక మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్ సజీద్ తెలిపారు.

పది రోజుల క్రితమే..

గత పది రోజుల క్రితమే ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురై ఓ విద్యార్థి చనిపోయిన ఘటన మరువకముందే ఉదయం శుక్రవారం జరిగిన ఘటనతో జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఇంతకు గురుకుల పాఠశాలలో విద్యార్థులు కడుపునొప్పితో చనిపోయాడా మరేదైనా అస్వస్థతకు గురయ్యారా అనే పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Next Story