విద్యార్థుల భోజనంలో నాణ్యత తగ్గితే క్షమించేది లేదు

by Sridhar Babu |
విద్యార్థుల భోజనంలో నాణ్యత తగ్గితే క్షమించేది లేదు
X

దిశ, రామగుండం : విద్యార్థుల భోజనంలో నాణ్యత తగ్గితే క్షమించేది లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. అలాగే పుట్నూరు గ్రామంలో కస్తూర్బా బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కుక్కల గూడూరులోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ పట్ల అప్రమత్తత అవసరం అని, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.

అదే విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని, క్రమ పద్ధతిన విద్యార్థుల ప్రమాణాలు పెరిగేలా చూడాలని సూచించారు. అలాగే పుట్నూర్ గ్రామంలో ఆరోగ్య సేవలు, ఔట్ పేషెంట్ సేవలు కచ్చితంగా అమలు చేయాలని, ఓపీ సమయంలో వైద్యులు అందుబాటులో ఉండాలని అన్నారు. అలాగే రామగుండం కార్పొరేషన్ లో ఉన్న ఐటీఐ కేంద్రం తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed