పశు వైద్య కేంద్రం ఉంది కానీ.. ఉద్యోగులు మాత్రం నిల్

by Disha Web Desk 23 |
పశు వైద్య కేంద్రం ఉంది  కానీ..  ఉద్యోగులు మాత్రం నిల్
X

దిశ, ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రంలో ఉద్యోగ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో మండల కేంద్రంలోని పలు గ్రామాల రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివరాలు పరిశీలిస్తే మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి . ఆవులు, గేదెలు 13 వేల వరకు ఉంటాయని ,50 వేల వరకు మేకలు గోర్లు ఉన్నాయని ,ఇన్చార్జి డాక్టర్ సతీష్ తెలిపారు. మండలం లో గాలి పెళ్లి, ఇల్లంతకుంట ,గ్రామాలలో మాత్రమే పశు వైద్య కేంద్రాలు ఉన్నాయి. గాలి పెళ్లి పశువైద్య కేంద్రంలో డాక్టర్ సతీష్, ఆఫీస్ సబార్డినేట్ ఇద్దరూ పనిచేస్తున్నారు.

ఇల్లంతకుంట పశు వైద్య కేంద్రం 1970 నుండి మండల కేంద్రంలో ఉంది. ప్రస్తుతం ఈ ఎడ్ల దావాఖానాలో డాక్టర్ పోస్ట్, వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్ ,అటెండర్ పోస్టులు, అన్ని ఖాళీగా ఉన్నాయి . పశు వైద్య కేంద్రం మాత్రం పదిలంగా ఉంది . గాలి పెళ్లి డాక్టర్ సతీష్ ఇక్కడ ఇన్చార్జి డాక్టర్ గా కొనసాగుతున్నారు . ఆయనతోపాటు వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులో సిరిసిల్లలో పనిచేస్తున్న ఉద్యోగి ఇక్కడ ఇంచార్జ్ వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులో ఉన్నాడు. ఇన్చార్జి డాక్టర్ ,వెటర్నరీ అసిస్టెంట్ రాకుంటే ఇల్లంతకుంట పశు వైద్య కేంద్రం తాళం తెరుచుకోదు . వెల్జిపురం గ్రామానికి చెందిన ఓ రెమ్ శివారెడ్డి అనే రైతు బుధవారం నాడు ఇల్లంతకుంట పశు వైద్య కేంద్రానికి ఉదయం వచ్చి 11:30 గంటల వరకు వేచి ఉన్న దవాఖాన తెరవకపోవడంతో నిరాశకు గురై తను తీసుకొచ్చిన పశువును తీసుకెళ్తూ దిశ పత్రికకు తన ఆవేదన వెలిబుచ్చారు.

దీంతో దిశ పత్రిక డాక్టర్ సతీష్ ను వివరణ కోరగా తాను గాలి పెళ్లి పశు వైద్య కేంద్రంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఇన్చార్జి వెటర్నరీ అసిస్టెంట్ ఆఫీసు పని నిమిత్తం జిల్లా కేంద్రంలో ఉన్నట్లు తెలిపారు . మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రంలో ఒక ఉద్యోగి కూడా లేకపోవడం పట్ల మండల రైతులు తమ ఆక్రోశాన్ని వెలిబుచ్చుతూ మండల నాయకులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మండల రైతులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సమస్యపై దృష్టి సారించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని మండల రైతాంగం ముక్తకంఠంతో కోరుతున్నారు.


Next Story

Most Viewed