ఇంటి పేరు కల్వకుంట్ల తీసేసి.. అబద్ధాల అని పెట్టుకో.. కేసీఆర్‌పై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు

by Disha Web Desk 19 |
ఇంటి పేరు కల్వకుంట్ల తీసేసి.. అబద్ధాల అని పెట్టుకో.. కేసీఆర్‌పై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల కదనరంగంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ వెదర్‌ను హీటెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్ అని అభివర్ణించారు.

కేసీఆర్ తన ఇంటి పేరు కల్వకుంట్ల అని తీసేసి అబద్ధాల అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బాధ రాష్ట్రంలో కరెంట్ కోతల గురించి కాదని.. పొలిటికల్ పవర్ లేదని ఆయన అసలు బాధ అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు పొలిటికల్ పవర్ కట్ చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటను ఇక నమ్మరన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సెక్రటేరియట్‌లో కేసీఆర్ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలిస్తే అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రధాని అవుతారని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More...

కేసీఆర్ బాధ కరెంట్ గురించి కాదు.. పొలిటికల్ పవర్ కట్ చేశారని:జగ్గారెడ్డి



Next Story

Most Viewed