రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్

by Disha Web Desk 17 |
రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో అక్రమంగా డ్రగ్స్‌ను తరలించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో బోటును అడ్డుకున్నారు. దీనిలో ఉన్న 14 మంది పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకుని 86 కిలలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో దాదాపు రూ.600 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గత కొంత కాలంగా భారత్‌లోకి డ్రగ్స్‌ను తరలించడానికి ఉగ్రవాదులు, స్మగ్లర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కోస్ట్ గార్డ్‌తో పాటు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా పెట్టాయి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బోటు గురించిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అందించగా భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది బోటును పట్టుకోవడానికి నౌకలు, విమానాలను మోహరించి, ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. బోటును పట్టుకున్నాక దానిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 86 కిలోల డ్రగ్స్‌ను కనిపెట్టారు. స్వాధీనం చేసుకున్న బోటును, దానిలో పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ కోసం పోర్‌బందర్‌కు తరలించారు.



Next Story

Most Viewed