AP News:పల్లెబాట పట్టిన విశాఖ ఓటర్లు..

by Jakkula Mamatha |
AP News:పల్లెబాట పట్టిన విశాఖ ఓటర్లు..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:ఎన్నికల పండుగ కోసం విశాఖ ఊరెళ్లింది. సెటిలర్ సిటీగా పేరుపడ్డ విశాఖలో నివసించే ఉత్తరాంధ్ర వాసులతో పాటు, గోదావరి జిల్లాల వారు వేల సంఖ్యలో విశాఖలో ఉపాధి పొందుతున్నారు. అయితే ,వీరి ఓట్లు స్వగ్రామంలోనే వుండడంతో ఓటు వేసేందుకు వీరంతా తరలివెళ్లారు. ఎంఎల్ఏ, ఎంపీ ఎన్నికల కంటే స్ధానిక సంస్ధల ఎన్నికలు ఇందులో చాలా మందికి ముఖ్యం కావడంతో విశాఖలో వుంటున్నప్పటికీ ఇక్కడకు ఓటును బదిలీ చేసుకోలేదు. ఖాళీ అయిన అపార్ట్మెంట్ లు విశాఖ నగరంలో అపార్ట్మెంట్‌ల వాచ్ మెన్ లుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారే 80 శాతం వరకూ ఉన్నారు.

అక్కడ వ్యవసాయం చేసుకుంటూ విశాఖలో పిల్లలను చదివించుకుంటూ వాచ్ మెన్ లుగా పనిచేస్తుంటారు. అటువంటి వారంతా ఓటు వేసేందుకు ఆదివారం బయలుదేరడంతో ఇళ్లు తాళాలతో దర్శనమిస్తున్నాయి. చిరు ఉద్యోగులు, కార్మికులు విశాఖలో పలు సంస్ధలలో , కర్మాగారాలలో పనిచేసే చిరు ఉద్యోగులు, కార్మికులు కూడా స్వంత ఊర్లకు ఓటు వేసేందుకు తరలివెళ్లారు. ప్రభుత్వం సోమవారం కూడా సెలవు దినంగా ప్రకటించడంతో వీరంతా ఆదివారమే బయలుదేరి వెళ్లారు. ఓటుకు నోటుతో మరింత ఆకర్షణ అన్ని నియోజకవర్గాలలో ఇరు ప్రధాన పార్టీలు ఓటుకు వేయి రూపాయలు తక్కువ కాకుండా ఇస్తుండడం కూడా ఆకర్షణగా మారింది. వట్టి చేతులతో ఊరు వెళ్లి వచ్చే కంటే వేల రూపాయలతో తిరిగి రావచ్చన్న అభిప్రాయంతో పెద్ద ఎత్తున బయలుదేరారు.

Advertisement

Next Story

Most Viewed