- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap Elections: వాళ్లిద్దరూ గెలుస్తారా..?. కోట్లు బెట్టింగ్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. దీంతో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇద్దరు అభ్యర్థుల గెలుపుపై కోట్లు బెట్టింగులు నడుస్తున్నాయి. గెలుస్తారని కొందరు, గెలవరని కొందరు ఆస్తులు, భూములు, నగదు బెట్టింగ్ కడుతున్నారు. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్, మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేశ్ గెలుపోటములపై ఆయా పార్టీల నాయకులు జోరుగా బెట్టింగులు కాస్తున్నారు.
Read More..
ఈసీ సీరియస్... ఐదుగురు సీఐల బదిలీ
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై వంగా గీత పోటీ చేస్తుండగా... మంగళగిరిలో నారా లోకేశ్‌పై మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కోడలు లావణ్య బరిలో ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?.. ఎన్ని సీట్లు వస్తాయి.? అని కూడా బెట్టింగులు కడుతున్నారు. పిఠాపురం, మంగళగిరి, ఆళ్లగడ్డ, విజయవాడ సెంట్రల్, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, గన్నవరం, గుడివాడ, ఉండి, నగరి, నెల్లూరు రూరల్, చీరాల, దర్శి నియోజకవర్గాల్లో కోట్లలో బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.