- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైసమ్మ బోనాలకు పోతున్న గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు..
దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో ఇతనాల్ వ్యతిరేక సెగలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇతనాల్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా స్తంభంపల్లి గ్రామస్తులు ఆదివారం రోజున మూకుమ్మడిగా మైసమ్మ బోనాలు తీయడానికి ముందుకు వచ్చారు. గ్రామస్తులంతా బోనాలు తలకెత్తుకుని సర్పంచ్ ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశానికి ర్యాలీగా బయలు దేరారు. గ్రామంలో మైసమ్మ బోనాలు తీస్తున్నారనే సమాచారం మేరకు ఉదయాన్నే గ్రామం చుట్టూ పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా గ్రామస్తులు భయపడకుండా మైసమ్మ బోనాలు తీయడానికి బయలు దేరారు.
ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మించేసే నం.1090 ప్రదేశాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించుకున్న పోలీసులు, గ్రామస్తులను అక్కడికి చేరకుండా పొలిమేరలోనే అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి రోప్ వలయం ఏర్పాటు చేసి ప్రజలు ఇతనాల్ ప్రదేశానికి వెళ్లకుండా నిలువరించారు. మా దేవుని దగ్గరికి మా భూమిలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు మీరెవరు మీకు ఆ హక్కు ఎవరిచ్చారు అని పోలీసుల పై గ్రామస్తులు మండిపడ్డారు. మా గ్రామానికి సంబంధించిన భూమిని మీరెలా నిషేధిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్యన కొద్దిసేపు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చివరకు పోలీసులు ప్రజలు ఒకరినొకరు తోసేసుకున్నారు. ప్రజలు అడుగు ముందు వేయకుండా పోలీసులు భారీ బందోబస్తుతో సీఐ బిళ్ళ కోటేశ్వర్ రోప్ వలయాన్ని ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.
పోలీసులు ఏర్పాటు చేసిన రోప్ వలయాన్ని ప్రజలు ఛేదించుకొని ముందుకు సాగారు. స్తంభంపల్లి గ్రామం నుంచి ప్రజలు ఇతనాల్ ప్రదేశానికి చేరుకునే వరకు నాలుగు సార్లు ప్రజలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించినా ప్రజలు ఆగకుండా ఇతనాల్ ప్రాజెక్టు నిర్మించే ప్రదేశానికి వేగంగా చేరుకున్నారు. ఈ సందర్భంగా పలుమార్లు ప్రజలకు పోలీసులుకు మధ్యన తీవ్రమైన ఘర్షణ జరిగింది. మా జీవితాలను నాశనం చేసే విత్తనాలు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించ వద్దని ప్రజలు పోలీసులను వేడుకున్నారు. అనంతరం ప్రజలు పవిత్రంగా వండివార్చిన బోనాలను మైసమ్మ తల్లికి సమర్పించి కోళ్లను కోసి రక్త తర్పణం చేశారు.
మా ప్రాణాలను తీయడానికి వచ్చిన మహమ్మారి ఇతనాల్ ప్రాజెక్టు ఇక్కడి నుండి తరలిపోయేలా చూడాలని మైసమ్మ తల్లిని ప్రజలంతా వేడుకున్నారు. స్తంభంపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు మైసమ్మ బోనాలకు విచ్చేసిన జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శైలేందర్ రెడ్డిలను పోలీసులు రోడ్డుపైనే నిలిపేశారు ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన ఎంతగా ప్రయత్నించినా పోలీసులు అనుమతిని ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. ప్రజల అభిప్రాయాలు ఆకాంక్షల మేరకే పోలీసులు విధులు నిర్వర్తించాలి గాని ప్రభుత్వం చెప్పిందానికి తలాడించే వారిగా ఉండ ద్దని డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు.