జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎస్.ఐ రాత పరీక్ష

by Shiva |   ( Updated:2023-04-09 14:26:16.0  )
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎస్.ఐ రాత పరీక్ష
X

దిశ, కరీంనగర్: పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో పైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్-ఇన్పెక్టర్ (సివిల్) ఎ.ఆర్/టీ.ఎస్.ఎస్.పీ/ఎస్.పీ.ఎఫ్/ఎస్.ఏ.ఆర్ సీపీఎల్/ఎస్.ఎఫ్.ఓ) అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు రోజుల పాటు జరిగిన రాత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. అభ్యర్ధుల రాత పరీక్ష కోసం కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్లలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు అనంతరం మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు కొనసాగింది. పరీక్షకు మొత్తం 12,560 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

పరీక్షల సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. పరీక్ష ముగిసేంత వరకు జిరాక్స్ సెంటర్లను మూసి వేశారు. నగరంలోని లాడ్జీలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. క్యూ పద్ధతిలో అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించారు. పురుష, మహిళ అభ్యర్థులను వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ వివరములను నమోదు చేశారు. కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బరాయుడు ప్రత్యక్ష్య పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగింది.

Advertisement

Next Story

Most Viewed