జనగామ రైతుల సమస్యలు పరిష్కరించాలి

by Sridhar Babu |
జనగామ రైతుల సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, గోదావరిఖని : జనగామ రైతుల సమస్యలు పరిష్కరించాలని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. కేసీఆర్ పాలనలో నిండుకుండలా ఉన్న గోదావరి నేడు ఎడారిని తలపిస్తుందన్నారు. శుక్రవారం జనగామ గ్రామంలో రైతులతో ఆయన సమావేశం ఆయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగామ రైతుల సమస్యల పరిష్కారం కోసం శనివారం గ్రామంలో రైతులతో కలిసి వంటావార్పు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరవుతారని, జనగామ రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గోదావరి పరీవాహక ప్రాంత గ్రామాల రైతులు సాగునీరు అందక నానా కష్టాలు పడుతున్నారని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని వదిలి జనగామ రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మెదలయ్యాయని అన్నారు. గోదావరిలో నీరు లేక ఇసుక తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో దాదాపు 600 మీటర్ల మేర బోర్లు వేస్తే కానీ నీరు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని వదిలి అన్నారం సుందిళ్ల గేట్లు మాసివేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed