- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాంతిదూత... యేసు క్రీస్తు
by Sridhar Babu |
X
దిశ,పెగడపల్లి : ప్రపంచ మానవాళికి శాంతిని, కరుణను చూపిన మహనీయుడు యేసు క్రీస్తు అని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న విప్ లక్ష్మణ్ కుమార్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విప్ మాట్లాడుతూ ప్రపంచానికి శాంతిని, కరుణను పంచుతూ విశ్వమంతా శాంతిమయంను కాంక్షించిన మహోన్నత వ్యక్తి యేసు క్రీస్తు అని, అతను చూపిన శాంతి మార్గంలో ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఒరుగల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు సంధి మల్లా రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, నాయకులు కడారి తిరుపతి, పూసల తిరుపతి, చెట్ల కిషన్, దికొండ మహేందర్, ఛాట్ల విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story