Former MLA Korukanti Chander : కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సింగరేణి యాజమాన్యం..

by Sumithra |
Former MLA Korukanti Chander : కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సింగరేణి యాజమాన్యం..
X

దిశ, గోదావరిఖని : సింగరేణి యాజమాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.. ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేదు.. గని ప్రమాదానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా కోరుకంటి చందర్ అన్నారు. సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 ఇంక్లైన్ గని ప్రమాద బాధితులు శంకర్, నోయల్ ను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ప్రమాదం జరిగిన తీరును వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. కార్మికుల కుటుంబాలను కలిసి మనోధైర్యాన్ని కల్పించారు. గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి ఉన్నతాధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వరుస గని ప్రమాదాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణ పై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు సంబంధించి బాధ్యులపై క్రిమినల్ చర్య తీసుకొని, వారిని సస్పెండ్ చేయాలన్నారు.

సింగరేణి కార్మికుల రక్షణలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సింగరేణికి ఉత్పత్తి పై ఉన్నశ్రద్ధ కార్మికుల రక్షణలో లేదని మండిపడ్డారు. కార్మికుల పనిస్థలాల్లో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సరైన రక్షణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కార్మికుల పై ఒత్తిడి చేస్తూ పని చేయుంచడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి అధికారులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవాడానికే పని చేస్తున్నట్లు కనబడుతుందని, కార్మికుల సంక్షేమం పట్ల గాని రక్షణ యాజమాన్యానికి పట్టింపు లేదన్నారు. కార్మికులను కాపాడటంలో భద్రత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ప్రమాద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామమూర్తి, వడ్డెపల్లి శంకర్, చెల్పూరి సతీష్, జె.వి.రాజు, పర్లపల్లి రవి బోడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి చెలకలపల్లి శ్రీనివాస్, శేషగిరి కిరణ్ జీ, మహేందర్ కనకరాజ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed